Resultado encontrado

Anjali Anjali

A.R. Rahman feat. S. P. Balasubrahmanyam & K. S. Chithra
Enviar Pesquisar

అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి

నిన్నదాక నువ్వు నేను ఇరువురం ఎవరనీ
కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని
కడలిని పడు వానలా కలిసిన మది ఇది
కరిగిన సిరి మోజులా కథ ఇది నా చెలి
ఎదురుగ తొలి స్వప్నం తొణికినది
ఎదలో మధు కావ్యం పలికినది
అంజలి అంజలి వలపుల నా చెలి
పూవంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి

కన్నుల సంకేతమే కలలకు తొలకరి
వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి
గుండెలో సంగీతమే కురిసినదెందుకో
కోయిల పాటే ఇలా పలికినవి ఇందుకో
చెలువుగ ఎద మారే మధు వనిగా
అమవస నిశి మారె వెన్నెలగా
అంజలి అంజలి ఇది హృదయాంజలి
నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి
ఎద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయిన నీ మదికి కవితాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి

అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే
అంజలి నా ఊపిరై పలికెను పల్లవే
కన్నుల నువ్వు లేనిదే కలలే రావులే
నా మది నువ్వు లేనిదే కవితే లేదులే
తెలిసెను నువ్వే నా మనసువని
మోజుకు నెలవైన వలపువని
అంజలి అంజలి వలపుల నా చెలి
పూవంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి

Observação

Resultado automático

Esta letra foi encontrada automaticamente e pode precisar de revisão.

Quando ela for adicionada ao catálogo principal do EMXStudio, poderá receber tradução, correção, categoria, artista vinculado e informações completas.