Resultado encontrado

Matarani

S. Janaki, S.P. Balasubrahmanyam
Enviar Pesquisar

మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది
మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది
గానం ఇదీ నీ ధ్యానం ఇదీ ధ్యానములో నా ప్రాణమిదీ
ప్రాణమైన మూగ గుండె రాగమిదీ
మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది
మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది

ముత్యాల పాటల్లొ కోయిలమ్మా ముద్దారబోసెది ఎప్పుడమ్మా
ఆ పాల నవ్వులో వెన్నెలమ్మా దీపాలు పెట్టేది ఎన్నడమ్మా
ఈ మౌన రాగాలా ప్రేమావేశం యేనాడో ఒకరి సొంతం
ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేలా ఇంత పంతం
నింగీ నేలా కూడే వేళ నీకూ నాకూ దూరాలేలా
అందరాని కొమ్మ ఇదీ కొమ్మ చాటు అందమిదీ
మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది

చైత్రాన కూసేను కోయిలమ్మా గ్రీష్మానికా పాట ఎందుకమ్మా
రేయంత నవ్వేను వెన్నెలమ్మా నీరెండకా నవ్వు దేనికమ్మా
రాగలా తీగల్లో వీణా నాదం కోరిందీ ప్రణయ వేదం
వేసారూ గుండెల్లొ రేగే గాయం పాడిందీ మధుర గేయం
ఆకాశాన తారా తీరం అంతే లేని ఎంతో దూరం
మాట రాని మౌనమిదీ మౌన వీణ గానమిదీ
అందరాని కొమ్మ ఇదీ కొమ్మ చాటు అందమిదీ
కూడనిది జత కూడనిదీ చూడనిదీ మది పాడనిదీ
చెప్పరాని చిక్కుముడి వీడనిదీ
మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది
అందరాని కొమ్మ ఇదీ కొమ్మ చాటు అందమిదీ

Observação

Resultado automático

Esta letra foi encontrada automaticamente e pode precisar de revisão.

Quando ela for adicionada ao catálogo principal do EMXStudio, poderá receber tradução, correção, categoria, artista vinculado e informações completas.