క్షేమమా, ప్రియతమా
సౌఖ్యమా, నా ప్రాణమా
కుసుమించే అందాలు కుశలమా
వికసించే పరువాలు పదిలమా
మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా
మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా
క్షేమమా, ప్రియతమా
సౌఖ్యమా, నా ప్రాణమా
కుసుమించే అందాలు కుశలమా
వికసించే పరువాలు పదిలమా
మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా
మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా
క్షేమమా, ప్రియతమా
సౌఖ్యమా, నా ప్రాణమా
నీలి కురుల వాలు జడల చాటు నడుము కదలిక, కుశలమా
అడగలేక అడుగుతున్న తీపి వలపు కానుక, పదిలమా
నీలోని దాహాలు అవి రేపే విరహాలు చెలరేగే మోహాలు క్షేమమా
నీలి కురుల వాలు జడల చాటు నడుము కదలిక, కుశలమా
అడగలేక అడుగుతున్న తీపి వలపు కానుక పదిలమా
నీలోని దాహాలు అవి రేపే విరహాలు చెలరేగే మోహాలు క్షేమమా
చలి గాలి గిలిగింత సౌఖ్యమా
చెలి మీద వలపంతా సౌఖ్యమా
నీ క్షేమమే నా లాభము
నీ లాభమే నా మోక్షము
క్షేమమా, ప్రియతమా
సౌఖ్యమా, నా ప్రాణమా
కుసుమించే అందాలు కుశలమా
వికసించే పరువాలు పదిలమా
మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా
కాలమల్లె కరిగిపోని గాఢమైన కౌగిలి కుశలమా
నన్ను తప్ప ఎవరినింక తాకలేని చూపులు పదిలమా
నీ నీలి కడకొంగు ఆలోని ఎద పొంగు అవి దాచే నీ సిగ్గు క్షేమమా
కాలమల్లె కరిగిపోని గాఢమైన కౌగిలి కుశలమా
నన్ను తప్ప ఎవరినింక తాకలేని చూపులు పదిలమా
నీ నీలి కడకొంగు ఆలోని ఎద పొంగు అవి దాచే నీ సిగ్గు క్షేమమా
తహతహలు తాపాలు సౌఖ్యమా
బిడియాలు బింకాలు సౌఖ్యమా
నీ సౌఖ్యమే నా సర్వమూ
ఆ సర్వమూ నా సొంతమూ
క్షేమమా, ప్రియతమా
సౌఖ్యమా, నా ప్రాణమా
కుసుమించే అందాలు కుశలమా
వికసించే పరువాలు పదిలమా
మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా
క్షేమమా, ప్రియతమా
సౌఖ్యమా, నా ప్రాణమా
కుసుమించే అందాలు కుశలమా
వికసించే పరువాలు పదిలమా
మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా
Tradução automática
Este recurso será adicionado em breve.
Em breve, o EMXStudio poderá gerar uma tradução automática desta letra usando uma API ou pacote de tradução.
A tradução aparecerá aqui de forma organizada, mantendo o mesmo estilo das letras revisadas.
Resultado automático
Esta letra foi encontrada automaticamente e pode precisar de revisão.
Quando ela for adicionada ao catálogo principal do EMXStudio, poderá receber tradução, correção, categoria, artista vinculado e informações completas.